ఏలూరులో టీడీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ వారు ఈ ర్యాలీ చేపట్టారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డీఐజీ, ఎస్పీలకు వినతపత్రం ఇచ్చారు. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని టీడీపీ నేత మాగంటి బాబు హెచ్చరించారు.